: పచ్చ కండువా కప్పేసుకున్న మణిగాంధీ


ఈ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో సమావేశమై చర్చించిన అనంతరం కోడుమూరు వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చంద్రబాబు ఆయనకు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులతో పాటు పార్టీ నేతలు పయ్యావుల, ధూళిపాళ్ల, యరపతినేని, టీడీ జనార్దన్, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మణిగాంధీ మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు తెలిపారు. దీంతో గడచిన వారం రోజుల వ్యవధిలో మొత్తం ఏడుగురు వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరినట్లయింది.

  • Loading...

More Telugu News