: వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసిన పాండ్యా... కానీ హ్యాట్రిక్ కాదు!


అంతర్జాతీయ క్రికెట్లో, ఏ ఫార్మాట్ అయినా తానేసిన మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ భారత ఆటగాడు హరేన్ పాండ్యా తాను విసిరిన మూడు బంతుల్లో 3 ప్రత్యర్థి వికెట్లను పడగొట్టాడు. కానీ అది హ్యాట్రిక్ కాదు. ఎలాగో తెలుసా?... పాండ్యా పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆపై అతను బౌలింగ్ వేయలేదు. తరువాత శ్రీలంకతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో తొలి బంతికే దిల్షాన్ ను ఔట్ చేశాడు. ఇలా మూడు వరుస బంతుల్లో 3 వికెట్లు తీసినా, ఇవి రెండు మ్యాచ్ లు అవుతాయి కాబట్టి దాన్ని హ్యాట్రిక్ గా పరిగణించరు.

  • Loading...

More Telugu News