: ఫామ్ హౌజ్ లో కేసీఆర్... అల్లం పంటను పరిశీలించిన టీఎస్ సీఎం


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాస్తంత విశ్రాంతి దొరికింది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలు వెనువెంటనే గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట మునిసిపాలిటీల ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా గడిపిన కేసీఆర్ సోమవారం సాయంత్రానికి కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి నేరుగా మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌజ్)కు చేరుకున్నారు. సోమవారం రాత్రంతా ఆయన ఫామ్ హౌజ్ లోనే బస చేశారు. నిన్న తెల్లారగట్లే లేచిన కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియదిరిగారు. అక్కడ సాగవుతున్న అల్లం పంటను ఆయన పరిశీలించారు. ఫామ్ హౌజ్ లో సాగవుతున్న ఇతర పంటల పరిస్థితిపైనా ఆయన అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News