: పురందేశ్వరిపై గోరంట్ల ఘాటు వ్యాఖ్య


మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామావు కూతురు, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరిపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు సంధించారు. టీడీపీలో గేట్లు మూసుకుపోవడంతోనే ఆమె బీజేపీలో చేరిందని కూడా వ్యాఖ్యానించారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి రూ.100 కోట్ల కేటాయింపులు మాత్రమే దక్కాయి. దీనిపై స్పందించిన పురందేశ్వరి... ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరే పోలవరం ప్రాజెక్టుకు తక్కువ నిధుల కేటాయింపునకు కారణమని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదన్న విషయాన్ని టీడీపీ సర్కారు బహిరంగంగా చెప్పడం లేదని, ఈ కారణంగానే నిధులు తక్కువగా వస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై నిన్నటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి విజయవాడ వచ్చిన గోరంట్ల ఘాటుగా స్పందించారు. బీజేపీలో కొత్త బిచ్చెగత్తె తయారైందని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుపై అన్ని విషయాలు తెలుసుకుని పురందేశ్వరి మాట్లాడాలని ఆయన అన్నారు. గడచిన ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరేందుకు ఆమె యత్నించారని, అయితే తాము వద్దని చెప్పడంతోనే ఆమె బీజేపీలో చేరిపోయారని గోరంట్ల వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News