: శ్రీలంకను చిత్తు చేసిన భారత్... ఫైనల్ కి బెర్త్ ఖరారు
టీమిండియా తన విజయపరంపరను కొనసాగిస్తోంది. ఆసియా కప్ 'టీట్వంటీ' టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది. దీంతో భారత్ ఫైనల్ కి తన బెర్త్ ను ఖరారు చేసుకుంది. 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో కాస్త తడబడ్డా చివర్లో ఆడుతూ పాడుతూ విజయాన్ని సాధించేసింది. భారత్ విజయంలో కోహ్లీ (56), యువరాజ్ సింగ్ (35) కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ కు 6 పాయింట్లు లభించడంతో ఫైనల్ కి చేరింది.