: నాగార్జునకు నాగార్జునే సాటి: అలీ


'శివ', 'గీతాంజలి', 'అన్నమయ్య', 'రామదాసు', 'సోగ్గాడే చిన్ని నాయన', 'ఊపిరి' ఇలా ఏ సినిమాకు ఆ సినిమా ఆణిముత్యంగా చెప్పుకోగలిగే ఏకైక నటుడు నాగార్జున అని ప్రముఖ హాస్య నటుడు అలీ చెప్పాడు. 'ఊపిరి' ఆడియో వేడుకలో అలీ మాట్లాడుతూ, నాగార్జునకు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదని అన్నాడు. అందుకే వైవిధ్యమైన సినిమాల్లో నటించి ఇమేజ్ ఛట్రాన్ని బద్దలు కొట్టాడని అన్నాడు. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని అలీ చెప్పాడు. ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలని, తనకా ధైర్యం ఉందని నాగార్జున చాటాడని అన్నాడు. ఈ సినిమాలో నటించిన కార్తీ అద్భుతమైన నటుడని, ఆయన వ్యక్తిత్వం గొప్పదని చెప్పాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. నాగార్జున చేయి తాకితే వారు తారస్థాయికి చేరుతారని అలీ చెప్పాడు.

  • Loading...

More Telugu News