: కార్తీ చాలా సహజంగా నటిస్తాడు: జయసుధ
దక్షిణాది నటుడు కార్తీ చాలా సహజంగా నటిస్తాడని ప్రముఖ సినీనటి జయసుధ ప్రశంసించింది. ఊపిరి చిత్రం ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను కూడా నటించానని చెప్పింది. ‘ఊపిరి’లో కార్తీ నటిస్తున్నప్పుడు చూస్తుంటే... అలానే చూడాలనిపించిందని, అంత సహజంగా నటిస్తాడని జయసుధ చెప్పింది. తన ఇద్దరు పిల్లలే తన ఊపిరి అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పింది.