: ఈ సినిమాకి సంగీతమే 'ఊపిరి': తమన్నా
ఈ సినిమాకి సంగీతమే 'ఊపిరి' అని ప్రముఖ నటి తమన్నా చెప్పింది. 'ఊపిరి' సినిమా ఆడియో వేడుకలో పాల్గోలేకపోయిన సందర్భంగా అభిమానుల కోసం ఓ వీడియో సందేశం పంపింది. ఇందులో మాట్లాడుతూ, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పీవీపీకి ధన్యవాదాలు చెప్పింది. నాగార్జున, కార్తీ వంటి వారితో కలసి నటించడం ఎంతో బాగుందని తెలిపింది. ఇలాంటి అవకాశం కల్పించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలని చెప్పింది. ఆడియో వేడుకలో పాల్గొనేందుకు ఎంతగానో ప్రయత్నించానని, అయితే షూటింగ్ ఉన్న కారణంగా పాల్గోలేకపోయానని తమన్నా చెప్పింది. ఈ సినిమాలో కీర్తి అనే అమ్మాయి పాత్ర పోషించానని, అది అద్భుతంగా ఉందని తమన్నా తెలిపింది. ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.