: రెండు నెలల అనంతరం తెరచుకున్న కాశ్మీర్ పాఠశాలలు
రెండు నెలల అనంతరం కాశ్మీర్ లో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. జమ్మూకాశ్మీర్ లో మంచు తీవ్రంగా కురుస్తుండడంతో అక్కడి విద్యాశాఖాధికారులు రెండు నెలల పాటు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి మెరుగుపడడంతో తిరిగి స్కూళ్లు తెరిచారు. పది నెలల పాటు ఇళ్లకు పరిమితమైన విద్యార్థులు తిరిగి పాఠశాలలు తెరుచుకోవడంతో ఉత్సాహంగా స్కూళ్లకు వెళ్లారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వేసవిలో ఎండల బారిన పడకుండా ఉండేందుకు స్కూళ్లకు సెలవులు ఇస్తారు. జమ్మూకాశ్మీర్ లో శీతాకాలంలో మంచు కురవడంతో తీవ్రతను అనుసరించి సెలవులు ఇస్తుంటారు.