: యూపీ ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ... సీఎం అభ్యర్థిగా ప్రతిపాదన!


రానున్న యూపీ ఎన్నికలలో ప్రియాంక గాంధీని రంగంలోకి దింపితే విజయావకాశాలు మెరుగుపడతాయనే వాదన కాంగ్రెస్ పార్టీ లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని, ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. కాగా, ఎన్నికల సమయం సమీపిస్తున్న ప్రతిసారీ, ఈ తరహా వాదనలు తెరపైకి రావడం సహజమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్గీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న నేపథ్యంలోనే యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరుపై ప్రచారం జరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంచితే, యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను తీసుకొస్తున్నారు. ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తరఫున ప్రశాంత్ కిషోర్ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News