: మా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను!: ఇలియానా
"మీకో ప్రశ్న. మీలో ఎంతమంది ఒంటరిగా ఉంటారు? ఒంటరిగా ఉన్నప్పుడు మీకు నచ్చే అంశమేంటి?" ఇది అందాల నటి ఇలియానా అభిమానులకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వేసిన ప్రశ్న. దీనికి తన సమాధానాన్ని కూడా ఇచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట, పొట్టి దుస్తులు ధరించి టీవీ ముందు ఒంటరిగా కూర్చుని స్నాక్స్ తినడం తనకెంతో ఇష్టమని చెప్పింది. పైగా తన ఇంట్లో తాను తనిష్టం వచ్చినట్టు ఉంటానని కూడా అంది. లియొనార్డో డికాప్రియోకు ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు వచ్చిందని, అతను అవార్డును తీసుకున్న క్షణాన్ని తాను మిస్ అయ్యానని కూడా చెప్పుకొచ్చింది.