: క్షణక్షణమూ కొనుగోళ్ల వెల్లువ... దూసుకెళ్తున్న కంపెనీలు!
ఆర్థికమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, దాని ఫలితాలు ఎలా ఉంటాయన్న విశ్లేషణకూ ఇన్వెస్టర్లకు కొంత సమయం పట్టింది. భవిష్యత్తులో భారత వృద్ధికి బడ్జెట్ ప్రతిపాదనలు తోడ్పడతాయన్న విశ్లేషణలతో ఈ ఉదయం నుంచి భారత స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్దే ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు క్రమంగా పెరుగుతూ వెళ్లాయి. ఆ తర్వాత ఇక ఏ దశలోనూ వెనుదిరిగి చూడని సూచికలు ఇప్పటికే దాదాపు 3 శాతం లాభాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 634 పాయింట్లు పెరిగి 2.8 శాతం లాభంతో 23,636 పాయింట్ల వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పెరిగి 2.8 శాతం లాభంతో 7,180 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 46 కంపెనీలు లాభాల్లో ఉండటం విశేషం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ముందు నిలిచి నూతన కొనుగోళ్లను ఉత్సాహంగా జరుపుతుండగా, వారిని దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు అనుసరిస్తున్నారు.