: హైటెక్ బాబు!...బెజవాడ నుంచి విశాఖలో ఆన్ లైన్ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన ఏపీ సీఎం


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిజంగా హైటెక్ బాబే. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు... రాష్ట్రాన్ని ఐటీ బాటలో పరుగులు పెట్టించారు. హైదరాబాదును హైటెక్ సిటీగానూ మార్చేశారు. తాజాగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... 13 జిల్లాలతో ఓ ముక్కగా ఏర్పడ్డ నవ్యాంధ్రకు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలనా వ్యవహారాల్లో సుదీర్ఘ విరామం వచ్చినా, చంద్రబాబు తన హైటెెక్ పాలనా రీతిని మాత్రం విడనాడలేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ను ఎక్కడి నుంచైనా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఏపీ రవాణా శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ప్రారంభించారు. ఇందులో హైటెక్ ఏముందంటారా? విజయవాడ నుంచి ప్రారంభించిన కార్యక్రమం... విశాఖలో ప్రారంభమైపోయింది. కొత్త తరహా విధానాన్ని తొలుత విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. దీనిని విశాఖకు వెళ్లకుండానే చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ నుంచే ప్రారంభించేశారు.

  • Loading...

More Telugu News