: సంగీత దర్శకుడు చక్రి ఆస్తి కోసం ఘర్షణకు దిగిన భార్య, తల్లి
టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చక్రి ఆస్తి తనకే దక్కుతుందని ఆయన సతీమణి శ్రావణి, తల్లిగా తనకే దక్కాలని ఆయన తల్లి విద్యావతి పరస్పరం గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గాలు అప్పట్లో హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా చక్రి ఆస్తి కోసం ఆయన తల్లి విద్యావతి, భార్య శ్రావణిల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఈ ఘర్షణతో షాక్ తిన్న చక్రి తల్లి విద్యావతి... ఆయన ఇంటి వద్ద ధర్నాకు దిగారు. చక్రి భార్యగా ఆయన ఆస్తిపై పూర్తి అధికారం తనకే ఉందని శ్రావణి వాదిస్తుండగా, తల్లిగా తనకూ వాటా ఇవ్వాలని విద్యావతి డిమాండ్ చేస్తోంది. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.