: సెట్ టాప్ బాక్సులకు మరో నాలుగు వారాల గడువు


కేబుల్ టీవీ వినియోగదారులు సెట్ టాప్ బాక్సులు అమర్చుకునేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. సెట్ టాప్ బాక్స్ లు అమర్చుకునేందుకు వాస్తవానికి నేటితో గడువు ముగిసింది. దీంతో సెట్ టాప్ బాక్సుల తయారీ విదేశాలపై ఆధారపడి ఉన్నందున, డిమాండ్ మేరకు సప్లై లేదని, అందువల్ల మరింత అదనపు సమయం కావాలని ఎంఎస్ వోలు హైకోర్టును కోరారు. కాగా, ఇప్పటి వరకు కనీసం 20 శాతం కూడా సెట్ టాప్ బాక్సులు అమర్చలేకపోయామని ఎంఎస్ వో సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి చెప్పారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చిన గడువులోపు సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని ఆయన ఆపరేటర్లు, వినియోగదారులకు సూచించారు. కాగా, డిజిటలైజేషన్ లో భాగంగా పట్టణ ప్రజలంతా సెట్ టాప్ బాక్సులు అమర్చుకోవాలని, రూరల్ ప్రజలు మరో రెండేళ్లలో అమర్చుకోవాలని గతంలో న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News