: భారత్-పాక్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై హిమాచల్ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యంతరం


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్- పాకిస్థాన్ మధ్య మార్చి 19న జరగనున్న మ్యాచ్ పై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ మ్యాచ్ నిర్వహించడంపై బీసీసీఐ పునరాలోచించుకోవాలని డిమాండ్ చేసింది. ఎంతోమంది అమరవీరుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ మ్యాచ్ ను ధర్మశాలలో నిర్వహించాలన్న ఆలోచన వెనుక బీసీసీఐ సెక్రటరీ, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ హస్తం ఉందని ఆరోపించింది. కార్గిల్ యద్ధంలో అమరవీరులైన కెప్టెన్ విక్రమ్ బాత్రా, కెప్టెన్ సౌరభ్ కలియాల స్మారక చిహ్నాలు ధర్మశాల స్టేడియానికి దగ్గరలో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించడం సరైంది కాదని తెలిపింది. ఈ ఒక్క మ్యాచ్ విషయంలో బీసీసీఐ ఆలోచనను మార్చుకోవాలని హిమాచల్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు థాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు కోరారు.

  • Loading...

More Telugu News