: ఒమన్ నటి కోసం కుక్కలను దొంగిలించి...జైలు పాలైన ప్రియుడు


ఒమన్ కు చెందిన ఓ సినీ నటికి జర్మన్ షెపర్డ్ కుక్కలంటే చాలా ఇష్టం. వాటిని ఆమెకు ఎలాగైనా బహుమతిగా అందజేయాలని భావించిన ఆమె స్నేహితుడు ఎమిరాటి, తన స్నేహితుడితో కలిసి ఒమన్ లోని ఓ పెట్ షాప్ కు వెళ్లి, అక్కడి అద్దాలు పగులగొట్టి అక్కడున్న మూడు జర్మన్ షెపర్డ్ కుక్కపిల్లలను ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు పెట్ షాప్ కు వెళ్లిన యజమాని, దొంగతనం జరిగిందని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించిన ఒమన్ పోలీసులు, సీసీ పుటేజ్ ను పరిశీలించి ఎమిరాటి, అతని స్నేహితుడు కేడీలను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తన ప్రియురాలు ఒమన్ నటి బీఏకు గిఫ్టుగా ఇచ్చేందుకు వాటిని దొంగిలించానని ఆయన పోలీసులకు వివరించాడు. దీంతో నటి బీఏను విచారించగా, తనకు కుక్కలను గిఫ్టుగా ఇచ్చిన సంగతి వాస్తవమేనని, అయితే అవి దొంగిలించి తెచ్చినవని మాత్రం తనకు తెలియదని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో వారిని కోర్టు ముందు హాజరుపర్చగా, వారికి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News