: చొక్కాలు చిరిగేలా... టీడీపీ కౌన్సిలర్లు చితక్కొట్టుకున్నారు
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. మినిట్స్ బుక్ విషయంలో టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి శ్రీనివాస్, త్రిమూర్తులు వాగ్వాదానికి దిగారు. నువ్వు మాట్లాడవద్దంటే, నువ్వు మాట్లాడవద్దంటూ ఇద్దరూ హెచ్చరికలు జారీ చేసుకున్నారు. దీంతో వాగ్వాదం ముదరడంతో ఇద్దరూ పరస్పర దాడికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. సహచరులు వారిస్తున్నా వినకుండా కుస్తీ పట్టారు. దీంతో మహిళా సహచరులు ఆందోళనతో పరుగులు తీయగా, మిగతా వారు కల్పించుకుని వారిని వారించారు. ఈ ఘర్షణలో ఒకరి చొక్కా చిరిగిపోవడం విశేషం.