: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కోహ్లీ పాట
నిన్నటి వరకు ప్రేమ పక్షులుగా తిరిగిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ విడిపోయి మూడు వారాలు దాటుతోంది. అయినా కోహ్లీ ఆ బాధలోంచి బయటపడ్డట్టు కనపడడం లేదు. తాజాగా విరాట్ కోహ్లీ ఓ ఫంక్షన్లో పాడిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాత బాలీవుడ్ సినిమా 'తాజ్ మహల్' లో 'జో వాదా కియా వో నిభానా పడేగా' (ప్రమాణం చేస్తే దానికి కట్టుబడి ఉండాలి) అంటూ సాగే క్లాసికల్ సాంగ్ ను ఓ ఫంక్షన్ లో పాడాడు. దీంతో ఫంక్షన్లో వారంతా హర్షం వ్యక్తం చేయగా, పాట అయిపోయాక 'పాపం, మనోడు ఇంకా అనుష్క శర్మను మర్చిపోయినట్టు లేడు' అంటూ జోకులు కూడా వేసుకున్నారట.