: లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ డబ్బులు తీసుకున్నాడు: పాక్ ఐఎస్ఐ ఏజెంట్ భార్య ఆరోపణ
ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ నుంచి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డబ్బులు తీసుకున్నారని ఆ దేశ సీక్రెట్ ఏజెంట్ సంస్థ ఐఎస్ఐ మాజీ ఉద్యోగి భార్య రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ 'ఖలీద్ ఖవాజా: షాహీద్-ఐ-అమాన్'అనే పుస్తకం రచించారు. పాకిస్థాన్ లో బెనజీర్ భుట్టో కుటుంబ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలనే లక్ష్యంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ భారీ ఎత్తున డబ్బు తీసుకున్నాడని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆల్ ఖైదా అందజేసిన డబ్బుతోనే నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చాడని ఆమె తన రచనలో ఆరోపించారు.