: రాహుల్ చెప్పిన సూచనకు బడ్జెట్ లో చోటు కల్పించా: అరుణ్ జైట్లీ
తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు ఓ విలువైన సూచన చేశారని, మరో ఆలోచన లేకుండా దాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించానని చెప్పారు. కనుచూపులేనివారు వినియోగించే బ్రెయిలీ పేపరును అన్ని రకాల సుంకాల నుంచి మినహాయించాలని ఆయన కోరారని, దీంతో సుంకాలు తొలగిస్తున్నామని ఆయన అన్నారు. బ్రెయిలీ పేపరుపై సుంకాల తొలగింపుతో ఈ రకం పేపర్ ధర 25 నుంచి 30 శాతం వరకూ తగ్గనుంది. మిగతా జైట్లీ ప్రతిపాదనల సమయంలో మౌనంగానో లేదా నినాదాలు చేస్తూనో స్పందించిన కాంగ్రెస్ సభ్యులు, ఈ వ్యాఖ్యలకు మాత్రం టేబుళ్లపై చేతులతో చరుస్తూ మద్దతిచ్చారు.