: 'బడ్జెట్ 2016' ముఖ్యాంశాలు-2!


ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనల్లోని మరిన్ని ముఖ్యాంశాలు... * మొత్తం వార్షిక బడ్జెట్ రూ. 19.78 లక్షల కోట్లు. * ప్రణాళికా వ్యయం రూ. 5.5 లక్షల కోట్లు. * ప్రణాళికేతర వ్యయం రూ. 14.28 లక్షల కోట్లు. * ద్రవ్య లోటు లక్ష్యం 3.5 శాతం. * రెవెన్యూ లోటును 2.8 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తాం. * ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు. * ముద్రా బ్యాంక్ ద్వారా రూ. 1.80 లక్షల కోట్ల రుణాలు. * ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 25 వేల కోట్ల కాపిటల్ సాయం. * ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా 50 శాతానికి తగ్గింపు. * రూ. 900 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. * 3.5 కోట్ల చౌకధరల దుకాణాల డిజిటలైజేషన్. * ఒక్క రోజులోనే స్టార్టప్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ అనుమతి. * సాగర్ మాల ప్రాజెక్టుకు రూ. 8 వేల కోట్లు. * రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళికా వ్యయం 28 శాతం పెంపు. * ఆర్థిక సేవల విషయంలో ఆధార్ తప్పనిసరి. * ఈ మేరకు కొత్త చట్టం. * దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గురు గోవింద్ సింగ్ జయంత్యుత్సవాలకు రూ. 100 కోట్లు. * 9 సూత్రాల ఆధారంగా పన్ను ప్రతిపాదనలు. * అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి మరింత వెసులుబాటు. * అద్దె నుంచి పన్ను రాయితీ రూ. 24 వేల నుంచి రూ. 60 వేలకు పెంపు. * సొంత ఇల్లు లేని, హెచ్ఆర్ఏ సౌకర్యం పొందని ఉద్యోగులకు వర్తింపు. * రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రాయితీలు. * రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను కేవలం రూ. 2 వేలు మాత్రమే. * ఇప్పటివరకూ రూ. 5 వేలుగా ఉన్న పన్నును తగ్గించడంతో కోట్లాది మందికి ప్రయోజనం. * గృహ రుణాలపై వడ్డీ మినహాయింపులు మరో రూ. 50 వేలు పెంపు. * 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు మెట్రోల్లో ఇల్లుంటే సేవా పన్ను రాయితీ. * మిగతా ప్రాంతాల్లో 120 చదరపు మీటర్ల వరకూ రాయితీలు. * స్టార్టప్ కంపెనీల లాభాలపై మూడేళ్ల పాటు నూరు శాతం పన్ను రాయితీలు. * వచ్చే మూడేళ్లలో పోస్టాఫీసుల్లో ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల పెంపు. * ఆధార్ ఆధారంగానే సంక్షేమ పథకాల రాయితీల చెల్లింపులు. * నిరామయి ఆరోగ్య బీమా పథకానికి సేవా పన్ను రాయితీలు. * వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే సర్ చార్జ్ 12 నుంచి 15 శాతానికి పెంపు. * అన్ని రకాల సేవలపై 0.05 శాతం కృషి కల్యాణ్ సెస్. * విలాసవంతమైన కార్లు, సీఎన్జీ వాహనాలపై 1 శాతం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్ * సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం 10 నుంచి 15 శాతానికి పెంపు. * ఎక్సైజ్ పన్ను నుంచి బీడీలకు మాత్రం మినహాయింపు. * ఐటీ రిటర్నుల పరిష్కారం లేటయితే, ఇచ్చే వడ్డీ 6 నుంచి 9 శాతానికి పెంపు. * ఆ భారం ఆదాయపు పన్ను శాఖ అధికారులపైనే. * కలలు నెరవేరే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయనే భావిస్తున్నా. * భవిష్యత్ వృద్ధి కోసమే ఈ బడ్జెట్. * మీరందరూ మనస్ఫూర్తిగా ఆమోదించాలన్నది నా విజ్ఞప్తి.

  • Loading...

More Telugu News