: 'బడ్జెట్ 2016' ముఖ్యాంశాలు!


ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనల ముఖ్యాంశాలు... * ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉన్న వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. * ఆర్థికమాంద్యం వేళ బలంగా కనిపిస్తున్న ఇండియా. * మన బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలు పటిష్ఠం. * ద్రవ్యోల్బణం 9.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. * జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతానికి పెరిగింది. * 2015లో 3.1 శాతానికి దిగజారిన అంతర్జాతీయ వృద్ధి రేటు. * విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. * ప్రభుత్వం తెచ్చిన పంటల బీమాతో రైతులకు మరింత భరోసా. * కీలక రంగాలకు అదనపు వనరులను సమకూర్చాం. * గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్ విభాగాలకు ఆర్థికసాయం. * 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధి మంత్రం. * ప్రభుత్వ బ్యాంకులకు మూలధన నిధులిచ్చి బలోపేతం. * మౌలిక సదుపాయాల మెరుగునకు మరిన్ని కేటాయింపులు. * వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు. * ప్రధాని సించాయ్ యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరు. * వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. 86,500 కోట్లు. * 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు. * నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువుల తయారీ. * పప్పుధాన్యాల అభివృద్ధికి రూ. 500 కోట్లు. * మరో 28.5 లక్షల ఎకరాలకు సాగునీరు * వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి జనరల్ ఇన్స్యూరెన్స్ లో పబ్లిక్ ఇష్యూలు. * ఇరిగేషన్ కోసం రూ. 17 వేల కోట్లు. * భూసార పరీక్షల కోసం రూ. 268 కోట్లు. * వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానంతో కేంద్ర ఖజానాపై భారం. * వ్యవసాయం - ఉపాధి హామీల అనుసంధానం. * గ్రామీణ రంగంలోని నిరుపేదలకు సహాయ సహకారాలు. * రహదారుల నిర్మాణానికి రూ. 27 వేల కోట్లు. * రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం. * రైతు రుణాలపై రాయితీకి రూ. 15 వేల కోట్లు. * వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఈ-మార్కెట్ ఏర్పాటు. * దేశంలో మూడో వంతు ప్రజలకు బీమా సౌకర్యం. * వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం. * పాడి రైతుల కోసం రూ. 850 కోట్లు కేటాయింపు. * నాబార్డు ఆధ్వర్యంలో రూ. 20 వేల కోట్లతో ఇరిగేషన్ నిధి. * రైతులకు రుణాల లక్ష్యం రూ. 9 లక్షల కోట్లు. * భూగర్భ జలాల పెంపునకు రూ. 60 వేల కోట్లు కేటాయింపు. * గ్రామీణాభివృద్ధికి రూ. 2.97 లక్షల కోట్లు. * 2018 మే 1లోగా అన్ని గ్రామాలకూ విద్యుత్. * జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు. * స్వచ్ఛ భారత్ కు రూ. 9 వేల కోట్లు. * ప్రధాని గ్రామ సడక్ యోజన కోసం రూ. 19 వేల కోట్లు. * 75 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి. * ఇది ప్రతి భారత పౌరుడికీ గర్వకారణం. వారందరికీ కృతజ్ఞతలు. * వచ్చే రెండేళ్లలో 5 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు. * పేదల కోసం కొత్తగా ఆరోగ్య బీమా పథకం. * ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకూ ఆరోగ్య బీమా సౌకర్యం. * 60 సంవత్సరాలు దాటిన వారికి అదనంగా మరో రూ. 30 వేల బీమా. * మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా స్టాండప్ పథకం. * పీపీపీ పద్ధతిలో నేషనల్ డయాలసిస్ సర్వీస్. * దేశవ్యాప్తంగా 1500 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు. * వీటికి అదనంగా 5,700 మల్టీ స్కిల్ కేంద్రాలు. * మూడేళ్లలో కోటి మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యం. * సర్వశిక్షా అభియాన్ కింద కొత్తగా 62 నవోదయా విద్యాలయాల ఏర్పాటు. * ఉన్నత విద్యకు రూ. 1000 కోట్లతో ఆర్థిక సహాయ నిధి. * నకిలీ డిగ్రీలను అరికట్టేందుకు డిజిటల్ డిపాజిటర్ విధానం. * ప్రధాని ఔషధ యోజన పేరిట కొత్త పథకం. * దీని ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల మెడికల్ స్టోర్ల ఏర్పాటు. * పేదలకు తక్కువ ధరలకే అన్ని రకాల ఔషధాలు అందిస్తాం. * 10 వేల కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం. * ఇందుకోసం రూ. 2.18 లక్షల కోట్ల కేటాయింపు. * మౌలిక రంగానికి రూ. 2.21 లక్షల కోట్లు * తూర్పు, పశ్చిమ తీరాల్లో మరిన్ని నౌకాశ్రయాల నిర్మాణం. * గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుల నిర్మాణానికి కట్టుబడ్డ ప్రభుత్వం. * ఉపయోగంలో లేని ఎయిర్ పోర్టుల అభివృద్ధికి రూ. 150 కోట్లు. * కొత్త ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై 8.33 శాతం వడ్డీ. * మొదటి మూడేళ్లూ వడ్డీ భారం కేంద్రమే భరిస్తుంది. * బహిరంగ మల మూత్ర విసర్జన లేని గ్రామాలకు పురస్కారాలు. * గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపునకు చర్యలు. * పంచాయతీలు, పురపాలక సంఘాలకు సాయంగా రూ. 2.87 కోట్ల గ్రాంటు. * స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలకు రూ. 500 కోట్లు. * అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులపై మరింత దృష్టి. * ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజనకు రూ. 1,700 కోట్లు. * సర్వీస్ కెరియల్ ప్లాట్ ఫాంతో రాష్ట్ర ఉపాధి కల్పనా కార్యాలయాల అనుసంధానం. * చిన్న దుకాణాలకు వారంలో అన్ని రోజులూ వ్యాపారానికి అనుమతి. * రైల్వేల అభివృద్ధికి రూ. 2.18 లక్షల కోట్లు. * పాసింజర్ బస్సుల నిర్వహణకు కొత్త ప్రయోగం. * రవాణా రంగంలో 'లైసెన్స్ రాజ్'కు స్వస్తి. * పాసింజర్ రవాణా రంగంలో ప్రైవేటు సంస్థలకు పచ్చజెండా. * చమురు నిక్షేపాల వెలికితీతకు అత్యంత ప్రాధాన్యం. * అణు విద్యుత్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు. * మౌలిక రంగంలో సదుపాయాలకు కొత్త రేటింగ్ విధానం. * ఇన్ ఫ్రా రంగంలో పన్ను రహిత బాండ్ల జారీ. * భారత్ లో తయారు చేసే ఆహార ఉత్పత్తుల సంస్థలకు నూరు శాతం ఎఫ్డీఐకి అనుమతి. * గ్రామీణాభివృద్ధికి గత సంవత్సరంతో పోలిస్తే 288 శాతం అధిక నిధులు. * పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖగా మార్పు * రుణ విధానం మరింత పారదర్శకం. * ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ చట్టానికి త్వరలో సవరణ. * సెబీ ద్వారా కొత్తగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్. * గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు మరిన్ని రాయితీలు. * ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణకు కార్యాచరణ. * స్టాక్ ఎక్స్ఛేంజీలు, బీమా, పింఛను రంగాల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు. * విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించేలా చట్టాలకు సంస్కరణలు.

  • Loading...

More Telugu News