: కింకర్తవ్యం!... పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ


క్రమంగా చేజారుతున్న ఎమ్మెల్యేలు... టీడీపీ ఎదురు దాడి... ఘాటు వ్యాఖ్యలు... అక్రమాస్తులకు సంబంధించిన కేసు దర్యాపులో వేగం... సమీపిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... వెరసి ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా మారిపోయారు. కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు వెళ్లిన ఆయన మొన్న కోర్టు ప్రాంగణానికే ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలతో హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహంపై జగన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారన్న వార్తలపైనా ఆయన ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News