: రాహుల్, కేజ్రీలు ఉగ్రవాదులకు మద్దతిచ్చారట!... కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లకు హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీసులు షాకిచ్చారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారని వారిపై హైదరాబాదుకు చెందిన న్యాయవాది జనార్దన్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విద్యార్థులు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లకు మద్దతుగా రాహుల్, కేజ్రీలు వర్సిటీల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదులకు మద్దతిచ్చారని గౌడ్ తన పిటిషన్ లో కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పిటిషనర్ వాదన సరైందేనని అభిప్రాయపడింది. అంతేకాక రాహుల్, కేజ్రీలతో పాటు సీపీఐ నేత డి.రాజా సహా మరో ఆరుగురిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీసులు రాహుల్, కేజ్రీ, రాజాలపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News