: నీరా రాడియా ఆసుపత్రిని ప్రారంభించిన రతన్ టాటా
మాజీ కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా ఆసుపత్రిని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని మధురలో నయతి హెల్త్ కేర్ పేరిట 351 పడకల ఆసుపత్రిని నీరా రాడియా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ ఆసుపత్రి ఇక్కడి ప్రజల వైద్య అవసరాలు తీరుస్తుందని అన్నారు. అనంతరం నీరా రాడియా మాట్లాడుతూ, కేవలం ఇక్కడే కాకుండా ఉత్తరభారత దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తామని అన్నారు. రోగుల శారీరక, మానసిక రుగ్మతలు తొలగించడంలో తమ ఆసుపత్రులు తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు.