: లంక బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల... ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరిన ఓపెనర్లు!


ఆసియాకప్ లో శ్రీలంకతో ఆతిథ్య జట్టు పోటీ పడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు... గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ తొలి ఓవర్ లోనే ఝలక్కిచ్చాడు. తొలి బంతిని డాట్ బాల్ గా సంధించిన మాథ్యూస్ రెండో బంతిగా అద్భుతమైన ఇన్ స్వింగర్ ను సంధించాడు. దీంతో మహ్మద్ మిథున్ ను ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. అనంతరం సౌమ్య సర్కార్ కు ముసిఫిజుర్ రహీమ్ జత కలిశాడు. దీంతో ఒక పరుగు సాధించాడు. రెండో పరుగు సాధించిన వెంటనే కులశేఖర సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని గాల్లోకి లేపగా మాథ్యూస్ దానిని ఒడిసిపట్టేశాడు. దీంతో బంగ్లా దేశ్ జట్టు రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక ఓపెనింగ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్ ను కంగారెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News