: మా పిల్లలు పాపాత్ములు...ఎలాంటి శిక్ష వేసిన మంచిదే!: అత్యాచారం నిందితుల తల్లిదండ్రులు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందినా యువతిపై సామూహిక అత్యాచారం చేసిన అంజయ్య, శ్రీనివాస్ తల్లిదండ్రులు జరిగిన దారుణంపై స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పిల్లలు పాపాత్ములని అన్నారు. వారికి ఎలాంటి శిక్ష విధించినా మంచిదేనని స్పష్టం చేశారు. ఇలాంటి పిల్లలు ఎవరికీ పుట్టకూడదని వారు స్పష్టం చేశారు. ఆడపిల్లలను ఎవరూ వేధించకూడదని వారు అభిప్రాయపడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని వారు పేర్కొన్నారు.