: అల్ట్రాటెక్ లో విలీనమైన జేపీ అసోసియేట్స్... డీల్ వాల్యూ రూ. 16,500 కోట్లు!


జైప్రకాష్ అసోసియేట్స్ నిర్వహణలోని సిమెంట్ కర్మాగారాలను రూ. 16,500 కోట్లతో కొనుగోలు చేయాలని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్స్ నిర్ణయించింది. అప్పులు సహా ఆస్తుల వేలానికి జేపీ అసోసియేట్స్ నిర్ణయించగా, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా సంస్థలను అధిగమించి అల్ట్రాటెక్ బిడ్ లో గెలిచింది. ఇరు కంపెనీల మధ్యా అవగాహనా ఒప్పందం కుదిరిందని నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో అల్ట్రాటెక్ వెల్లడించింది. సాలీనా 2.2 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యమున్న కర్మాగారాలను తమ అధీనంలోకి తీసుకోనున్నామని తెలిపింది.

  • Loading...

More Telugu News