: బాలయ్యను మినిస్టర్ ను చేయాలి: చంద్రబాబుకు సినీ నటి జయంతి సూచన
హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలూ పాటుపడుతున్న బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ సినీ నటి జయంతి చంద్రబాబునాయుడిని కోరారు. హిందూపురంలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా జయంతిని బాలయ్య, చంద్రబాబు సన్మానించగా, అనంతరం ఆమె మాట్లాడారు. తనను గుర్తు పెట్టుకుని బెంగళూరు నుంచి పిలిపించిన బాలకృష్ణను ఆమె అభినందించారు. ఎంతో రిస్క్ తీసుకుని బాలయ్య ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని, అందరికీ చాముండేశ్వరి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. "బాబుని చొప్పున మినిస్టర్ ను చేయాలి. చంద్రబాబునాయుడి ఆశీర్వాదం ఉండాలి" అని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కన్నడ హీరో శివరాజ్ కుమార్ పాడిన పాట, శివమణి డ్రమ్స్ వాయిద్యం అందరినీ అలరించాయి.