: ఐదో తరగతి సీబీఎస్ఈ గైడ్ లో రాహుల్ గాంధీపై వ్యాసం


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదటిసారి పుస్తకాలకెక్కారు. ఆయనపై ఐదో తరగతి సీబీఎస్ఈ ఇంగ్లిష్ గైడ్ లో ఓ వ్యాసం ఉంచారు. ప్రభావంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టిన రాహుల్ తన సోదరి ప్రియాంక తరహాలోనే ప్రజాజీవితాన్ని సహజంగా గడుపుతున్నారు అని వ్యాసంలో తెలిపారు. ఉత్సాహవంత రాజకీయ వేత్త అని కీర్తించారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎక్కువ కాలం గడిపిన రాహుల్, ఇప్పుడు కాంగ్రెస్ యువ నాయకులకు భవిష్యత్తును నిర్దేశిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, వ్యాసం కింద రాహుల్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇన్నాళ్లు జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ కుటుంబం గురించి పాఠాలు చదివిన విద్యార్థులు ఇకపై రాహుల్ గురించి కూడా తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News