: నాపై అభిమానానికి వర్మకు ధన్యవాదాలు: ముద్రగడ
దర్శకుడు రాంగోపాల్ వర్మకు తనపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ రాజకీయపార్టీ పెడితే తాను చేరతానన్న వర్మ వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ముద్రగడ స్పందించారు. తాను రాజకీయ పార్టీ పెట్టేంత పెద్దవాడిని కాదని చెప్పారు. వంగవీటి చిత్రం తీసేందుకు తన అనుమతి వర్మకు అవసరం లేదని అన్నారు. ఏదైనా అభ్యంతరం వుంటే వంగవీటి రంగా కుటుంబమే చెబుతుందని అన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుతున్నానని అన్నారు.