: భర్త, అత్త తనను వేధిస్తున్నారంటూ కేసు పెట్టిన కరిష్మా కపూర్!
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ మధ్య విభేదాలు తాజాగా కొత్త మలుపు తిరిగాయి. తన భర్త సంజయ్, అత్త రాణి సురిందర్ కపూర్ లు గత కొంతకాలంగా తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కొన్నిరోజుల కిందట ముంబయిలోని ఖర్ పోలీసులకు కరిష్మా ఫిర్యాదు చేసింది. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ, 34 కింద వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు వీరి విడాకుల కేసు ప్రస్తుతం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఉంది. ఇదిలా ఉంచితే, కరిష్మాకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని, పిల్లలను అడ్డం పెట్టుకుని డబ్బు కావాలని డిమాండ్ చేస్తోందని ఇటీవల సంజయ్ ఆమెపై ఆరోపణలు చేశాడు. ఈ కేసు మార్చి 3న విచారణకు రానుంది.