: 'వంగవీటి' అనే ఇంటిపేరు ఒకరి సొంతం కాదు: వర్మ


వంగవీటి అనే ఇంటిపేరు ఒకరి సొంతం కాదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. తాను తీయబోయే చిత్రానికి 'వంగవీటి' అనే ఇంటిపేరు పెట్టిన విషయమై రంగా కుటుంబసభ్యులను సంప్రదించారా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘గతంలో నేను ‘రక్తచరిత్ర’ చిత్రం తీసినప్పుడు పరిటాల రవి కుటుంబసభ్యుల నుంచి పర్మిషన్ తీసుకోలేదు. కంపెనీ సినిమా తీసినప్పుడు దావూద్ ఇబ్రహీం, చోటాల పర్మిషన్ కూడా తీసుకోలేదు’ అని వర్మ అన్నారు. ‘వంగవీటి’ చిత్రాన్ని తెరపైకెక్కించడం ద్వారా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశముందని, రెండు వర్గాల మధ్య మళ్లీ గొడవలు మొదలవుతాయనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఆ ఆలోచన చాలా ‘స్టుపిడిటి’. వంగవీటి సినిమా చూసిన వాళ్లకు నామీద కోపం రావడానికి ఆస్కారం ఉంటుంది తప్పా, మిస్ ఫైర్ అయ్యే ఆస్కారం లేదు. చలసాని వెంకటరత్నంతో సినిమా ప్రారంభమై రంగా హత్యతో సినిమా ముగుస్తుంది. జూన్ మొదటివారం నాటికి ఈ సినిమా రిలీజ్ చేస్తాము’ అని వర్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News