: ‘దడ పుట్టిస్తా’ టీమ్ వర్క్ పోస్టర్ ను విడుదల చేసిన నాయిని నరసింహారెడ్డి


విన్నీ వియాన్, నేహ, హరిణి, ఆన్య హీరో హీరోయిన్లుగా నాయిని పృథ్వీ రెడ్డి సమర్పణలో శక్తి సినిమా బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘దడ పుట్టిస్తా’. హారర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేశినేని శివనాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీమ్ వర్క్ పోస్టర్ ను తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "కేశినేని శివనాథ్ నిర్మిస్తున్న 'దడ పుట్టిస్తా' టీం వర్క్ పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. హారర్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో నటిస్తున్న విన్ని వియాన్, నేహ, హరిణి, ఆన్య సహా చిత్రంలోని ఇతర నటీనటులకు, టెక్నిషియన్స్ కు మంచి పేరు రావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్" అన్నారు.

  • Loading...

More Telugu News