: పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కు సీమంతం
సాధారణంగా పోలీస్ స్టేషన్ లలో ప్రేమికులకు పోలీసులే దగ్గరుండి పెళ్లిళ్లు చేయడం చూశాం. కానీ తోటి కానిస్టేబుల్ కు పోలీసులే సీమంతం చేయడం కొత్త విషయం. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో పోలీసులు ఈ తరహా సంప్రదాయానికి తెరతీశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రమీలకు పోలీసు సిబ్బంది సీమంతం నిర్వహించారు. 'మా చెల్లెలి సీమంతం' అంటూ పలువురిని పిలిచి మరీ ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల... ఆ ప్రాంత డీఎస్పీ, తోటి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. తనను తోటి సహోదరిగా అభిమానించి పీఎస్ సిబ్బంది పోలీస్ స్టేషన్ లో సీమంతం వేడుక నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పీఎస్ లలో కుటుంబ వాతావరణం ఏర్పడుతుందని డీఎస్పీ అన్నారు.