: భారత ఆర్థిక సర్వే-2016... ముఖ్యాంశాలు!
ఈ ఉదయం పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే-2016లోని ముఖ్యాంశాలు. ద్రవ్యలోటు: * మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 2015/16 ద్రవ్యలోటు 3.9 శాతం. * ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమే. * 2016/17 ఎన్నో సవాళ్లను మన ముందు ఉంచనుంది. * స్వల్పకాల ద్రవ్య విధానంపై సమీక్షించాల్సిన సరైన సమయం ఇదే. ద్రవ్యోల్బణం: * వినియోగ సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 నుంచి 5 శాతం మధ్య కొనసాగే అవకాశం. * తగ్గుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మేలు. * ధరల స్థిరత్వానికి సూచిక కూడా.. * మార్చి 2017లోగా 5 శాతం ఇన్ ఫ్లేషన్ లక్ష్యాన్ని ఆర్బీఐ చేరుకుంటుంది. కరెంట్ ఖాతాల లోటు: * జీడీపీలో కరెంట్ ఖాతాల లోటు 1 నుంచి 1.5 శాతం వరకూ ఉండే అవకాశం. పన్నులు: * దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలి. * సంపాదిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లింపు జాబితాలో ఉన్నారు. * వీరిని 20 శాతానికి చేర్చాలి. బ్యాంకింగ్, కార్పొరేట్ రంగం: * 2018/19 నాటికి బ్యాంకులకు రూ. 1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం. * బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి. * నిరర్థక ఆస్తుల మొత్తాన్ని తగ్గించుకోకుంటే ప్రమాదమే. * బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు. * కొనసాగనున్న డిజిన్వెస్ట్ మెంట్. * ప్రభుత్వ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలి. మరిన్ని ముఖ్యాంశాలు: * గత పదేళ్లలో హార్టికల్చర్ విభాగం 2.7 శాతం చొప్పున విస్తరించింది. * ఆహార ధాన్యాల కన్నా మెరుగైన దిగుబడి. * డిమాండున్న పంటల దిశగా రైతులు సాగాలి. * రైతులకు నియమిత మొత్తంలో సబ్సిడీ అవసరం. * రైతుల సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంకుల్లోకే జమ. * మొత్తం సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా కిందకు తేవాలి. * జాతీయ ఆహార భద్రత, స్వచ్ఛ భారత్ వేగవంతమవ్వాలి. * పోషకాహారం, పరిశుభ్రత దిశగా ఎన్నో మెట్లెక్కాలి. * మేకిన్ ఇండియాకు మరిన్ని ప్రోత్సాహకాలు కావాలి. * ముడి చమురు ధరలు ఈ ఏడాదంతా బ్యారల్ కు 35 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం. * దీని వల్ల భారత ఖజానాకు మేలు. * ఇండియాలో కరెంటు బిల్లులు తగ్గే రోజులు భవిష్యత్తులో. * దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. * ఇండియాలో పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలకు ఆదరణ. * ఈ రెండు విభాగాల్లో గణనీయమైన వృద్ధి. * పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇండియా. * మొత్తం పాలల్లో 18.5 శాతం ఇండియాలోనే.