: ఉద్యోగులకు మేలు... టాక్స్ స్లాబ్ పెంపు, గృహ రుణాలపై వడ్డీ రాయితీ!
దేశంలోని అన్ని వర్గాలకూ మేలు కలిగేలా పన్ను పరిధులను సవరించాలని అరుణ్ జైట్లీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల మినిమమ్ టాక్స్ స్లాబ్ ను రూ. 3 లక్షలకు పెంచనున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సోమవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో దీనిపై ప్రకటన ఉంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి వివరించారు. ఇదే సమయంలో గృహ రుణాలపై ఉన్న వడ్డీ రాయితీని రూ. 2 లక్షల వరకూ సవరించవచ్చని తెలుస్తోంది. కనీస పన్ను పరిధి రూ. 50 వేలు పెంచడం ద్వారా దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు లాభం కలుగుతుందని అంచనా. ఇక గృహ రుణాలపై వడ్డీ రాయితీని పెంచితే, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని పన్ను పరిధిలో ఉన్న వారందరికీ ఎంతో కొంత మిగులుతుంది.