: ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జేఎన్ యూ విద్యార్థులే కారకులు: బీజేపీ ఎమ్మెల్యే అహూజా కామెంట్


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా అభివర్ణించిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా నిన్న మరో సంచలన వ్యాఖ్య చేశారు. జేఎన్ యూలో వేల సంఖ్యలో కండోమ్ లు లభించాయని, రాత్రయితే విద్యార్థులు వర్సిటీలో నగ్నంగా తిరుగుతారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ రాజస్థాన్ ఎమ్మెల్యే నిన్న మరో బాంబు పేల్చారు. ఢిల్లీలో జరిగిన అత్యాచారాల్లో సగానికి పైగా జేఎన్ యూ విద్యార్థుల కారణంగానే జరిగాయని ఆయన ఆరోపించారు. దేశ రాజధానిలో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో సగానికి పైగా జేఎన్ యూ విద్యార్థులే బాధ్యులని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News