: సంజయ్ దత్ పేరు ఒకవేళ సిద్దిఖీ బాబా అయితే...: అసదుద్దీన్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విడుదలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యథావిధిగా తనదైన మార్గంలో స్పందించారు. ‘సంజయత్ దత్ పేరు సిద్దిఖీ బాబా అయితే ఏమయ్యేది? మతపరమైన చర్యలకు దారి తీసేది’ అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ రాణా అయూబ్ ట్వీట్ ను ఉదహరిస్తూ అసదుద్దీన్ అలా స్పందించారు. '1993 బాంబు పేలుళ్ల కేసులో మిగిలిన నిందితులందరూ జీవిత కాల శిక్షను ఎదుర్కొంటుంటే... సంజు బాబా మాత్రం ఘన స్వాగతం అందుకున్నారు. ఇది వంచన' అంటూ జర్నలిస్టు అయూబ్ ట్వీట్ చేశారు. 1993 బాంబు పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఐదేళ్ల జైలు శిక్షను సంజయ్ దత్ కు కోర్టు విధించింది. అయితే, 42 నెలలకే ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. విడుదల సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.