: రిజర్వ్ డ్ ప్రయాణికుల కోసం మూడు రకాల కొత్త రైళ్లు
రిజర్వేషన్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకున్న రైల్వే శాఖ అమాత్యుల వారు ప్రత్యేకంగా మూడు రకాల రైళ్లను బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు. హమ్ సఫర్: పూర్తిగా ఏసీ రైళ్లు, ప్రయాణికుల కోరిక మేరకు కావాలంటే ఆహారాన్ని కూడా అందిస్తారు. తేజాస్: ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా వినోదం, స్థానిక ఆహారం, వైఫై తదితర సేవలను కూడా సమకూర్చుతారు. ఉదయ్: రద్దీ మార్గాల్లో నడిపే ఉత్కృస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైళ్లు. ప్రస్తుత రైళ్ల కంటే అదనంగా 40 శాతం మేర ప్రయాణికుల చేరవేతకు వీలవుతుంది.