: నేను ఉగ్రవాదిని కాను, ఇకపై ముంబై పేలుళ్ల నిందితుడు అనొద్దు: చేతులెత్తి మొక్కుతూ సంజయ్ దత్
తాను ఉగ్రవాదిని కానని, ఇకపై తన పేరును ప్రస్తావించినప్పుడు "1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ముద్దాయి..." అని అనవద్దని వినమ్రంగా కోరుతున్నట్టు సంజయ్ దత్ తెలిపారు. ఈ మధ్యాహ్నం అసంఖ్యాక అభిమానుల నినాదాల మధ్య స్వగృహానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ముంబైలో జరిగిన దారుణ ఘటనలకు, తనకు ఎంతమాత్రమూ సంబంధం లేదని, సుప్రీంకోర్టు కూడా అదే నిజమని తీర్పించ్చిందని గుర్తు చేసిన ఆయన, తెలిసీ తెలీని చిన్నతనంలో చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇకపై తనను పేలుళ్ల కేసుతో జతచేర్చవద్దని చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నాడు.