: ఎమ్మెల్యేలను కొనడం వల్ల ప్రభుత్వాలు నిలబడవు: జగన్


వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి రూ.30 కోట్లు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వాలు నిలబడవని మండిపడ్డారు. ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పార్టీ ముఖ్య నేతలతో చర్చల అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. కేవలం నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన తమకేమి నష్టం లేదని, ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు మారిన చోట బలమైన నేతలను తయారు చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News