: పదవులు, డబ్బు కోసం పార్టీ మారుతున్న మీరా జగన్ ను విమర్శించేది?: అంజాద్ బాషా
మంత్రి పదవులు, డబ్బు మూటలు, కేసుల నుంచి బయటపడటమే లక్ష్యంగా పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తున్న వాళ్లకు జగన్ ను విమర్శించే నైతికత లేదని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా విమర్శించారు. ఈ ఉదయం జగన్ ను కలిసిన అనంతరం అంజాద్ మీడియాతో మాట్లాడారు. పార్టీ వీడిన వాళ్లకు రాజకీయ భవిష్యత్ ఉండదని, మరోసారి ఎన్నికలకు వెళితే, వారిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు. పార్టీలు మారిన వారు రాజీనామాలు చేసి, తిరిగి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.