: అంతా టీడీపీ మైండ్ గేమ్... జగన్ ను కలిసిన అనంతరం రఘురామిరెడ్డి,
జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి డుమ్మా కొట్టి, ఫిరాయింపు కలకలం రేపిన మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి తాను వైకాపాను వీడబోవడం లేదని స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రొద్దుటూరులో పార్టీ అధినేత జగన్ ను కలిసిన ఆయన, పార్టీ మారే విషయమై తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు చేయిస్తున్న దుష్ప్రచారమని, వారి మైండ్ గేమ్ కు తాము బలికామని, ఆ దెబ్బ వారికి తగిలే రోజు త్వరలోనే వస్తుందని నిప్పులు చెరిగారు. తాను వైకాపాలోనే కొనసాగుతానని, జగన్ వెంటే ఉంటానని అన్నారు.