: వరంగల్ లో టీడీపీ - బీజేపీ కటీఫ్!


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలసి పోటీచేసిన తెలుగుదేశం, బీజేపీలు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విడిపోయాయి. మొత్తం 58 డివిజన్లు ఉండగా, తెలుగుదేశం 48 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, బీజేపీ 43 మందిని బరిలోకి దింపింది. మిగిలిన 10 స్థానాల్లో ఆరింటిలో తమ అభ్యర్థులుంటారని, మిగతా నాలుగు చోట్ల ఇండిపెండెంట్లకు మద్దతిస్తామని తెలుగుదేశం చెబుతుండగా, మిగిలిన 15 డివిజన్లలో ఇతరులకు మద్దతిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు పార్టీలూ కలసి పోరుకు దిగడం లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిపోగా, పలు పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లనే ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ మరో 10 డివిజన్లలో అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి వుంది. కాంగ్రెస్ ఇప్పటివరకూ ఒక్క పేరు కూడా చెప్పలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేసేసి, తమకే బీఫాం వస్తుందన్న ధీమాలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News