: ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు... వలసలు మాని భవిష్యత్ చూడండి: బైరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు దిక్కుమాలిన రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి హితవు పలికారు. కర్నూలు జిల్లా పెద్దకడుగూరు, మంత్రాలయం మండలాల్లో బస్సు యాత్ర చేస్తున్న ఆయన, ప్రజలతో మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, వలసల కారణంగా సీమలో జనాభా తగ్గుతోందని, ఇప్పటికైనా సీమ అభివృద్ధిపై దృష్టిని పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పిల్లల భవిష్యత్ కు భరోసా కల్పించాలని, ఈ దిశగా ప్రభుత్వాలు చేయాల్సింది ఎంతో ఉండగా, నేతల ఫిరాయింపుల గోలేంటని ప్రశ్నించారు.