: మాజీ భార్య రేణూదేశాయ్ ని కలిసిన పవన్ కల్యాణ్
ఎంత విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలపై మమకారం ఉండకుండా పోతుందా? అందుకు పవర్ స్టార్ మాత్రం అతీతుడా? తన కుమారుడు అకీరా, కుమార్తె ఆద్యలతో పాటు మాజీ భార్య రేణూదేశాయ్ తో కలసి పవన్ కల్యాణ్ భోజనం చేస్తున్న చిత్రం ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్. హైదరాబాద్ లోని ఓ రెస్టారెంటులో వీరంతా కూర్చుండగా, ఆ సమయంలో అక్కడే ఉన్న ఎవరో ఈ ఫోటోను తీశారు. తన పిల్లలను పిలిపించుకున్న పవన్ వారితో సరదాగా గడిపారని తెలుస్తోంది. ఈ ఫోటో ఎప్పుడు తీశారన్న విషయం తెలియదుగానీ, పిల్లలను చూస్తుంటే, ఇటీవలిదేనని మాత్రం అనిపిస్తోంది.