: రాజ్యసభలో రోహిత్ వేముల మృతిపై దుమారం... సభ వాయిదా
హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మృతి అంశం రాజ్యసభలో దుమారం రేపింది. రెండోరోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టారు. అంతేగాక ఈ ఘటనపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిటీలో దళిత వ్యక్తులు ఉండేలా చూడాలని బీఎస్పీ అధినేత మాయావతి సహా ఇతర సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ, కమిటీలో దళిత సభ్యుడు కూడా ఉన్నారని సమాధానం ఇచ్చారు. అయినా వినకుండా మధ్యాహ్నం కూడా విపక్షాలు సభలో అదే డిమాండును కొనసాగించాయి. దాంతో చేసేదిలేక డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను 3.30 గంటల వరకు వాయిదా వేశారు.