: పర్వతాల్లో కూలిన తారా ఎయిర్ విమానం... ఇద్దరు విదేశీయులు సహా 23 మంది దుర్మరణం!


ఈ ఉదయం 7:45 గంటల సమయంలో నేపాల్ లోని పోఖారా నుంచి 20 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జామ్ సోమ్ కు బయలుదేరిన విమానం పర్వతాల్లో కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బయలుదేరిన పది నిమిషాల్లోపే మ్యాగ్దీ, ముస్తాంగ్ జిల్లాల సరిహద్దుల్లో కూలిందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఓ పర్వతంపై తమకు మంటలు కనిపించాయని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఆ ప్రాంతానికి రెండు హెలికాప్టర్లు బయలుదేరి వెళ్లాయి. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చైనా, ఓ కువైట్ జాతీయులు సహా అందరూ మరణించి వుంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ విమానం కొత్తదని, సెప్టెంబరులోనే కొనుగోలు చేశామని తారా ఎయిర్ తెలిపింది. విమాన ప్రమాదంపై విచారణ జరుపుతామని పేర్కొంది.

  • Loading...

More Telugu News